Pages

Friday, 14 September 2012

Instuctions to all Post Masters


                     
                                     భారత ప్రభుత్వం : : తపాలాశాఖ
             సూపరింటెండెంట్    వారి కార్యాలయము, నరసరావుపేట డివిజన్, నరసరావుపేట-522601.          
TO
All PMs/SPMs in the Division,
All IPs in the  Division,
All SAs in the Division.
No.Tech/computerization/Misc dated at Narasaraopet the                                                  30/08/12

Sub:- Total Computerization and IT enables services/provision of Internet facility to all POs in the Division- Reg
*******

మన నరసరావుపేట డివిజన్ నందు గల అన్ని ఆఫీసులు కంప్యూటరీకరించబడి ఇంటర్నెట్ సదుపాయం సమకూర్చడం జరిగినది. మన పోస్ట్ ఆఫీసుల నందు పని సాఫీగా గడవటానికి ఈ క్రింది ఆదేశాలు జారీ చేయడమైనది.
1. Point of Sale moduleలో RPLI పాలసీలకు సంభంధించి బుకింగ్ / రీబుకింగ్ (BO లకు సంబంధించినవి) చేయునపుడు పూర్తి పాలసీ నెంబర్ తో చేయవలెను.(ఉదా:- R-AP-VJ-EA-XXXXX). BPMలకు కూడా తగు విధంగా సూచించవలెను.

2. ఇంటర్నెట్ సదుపాయం ఉన్న అన్ని ఆఫీసులు వారు టెలిఫోన్ బిల్లులు e-Payment ద్వారా మాత్రమే కట్టించుకోవలెను. ( TRC ఆప్షన్ ఉపయోగించ కూడదు).

3. అన్ని ఆఫీసులు వారు తమ e-Daily Account ను ఈ-మెయిల్ ద్వారా సంబంధిత హెడ్ ఆఫీసుకు తప్పనిసరిగా పంపవలెను.

4. Sub-Accounts/Treasury/SB cash లేదా ఇతర ఏ module నందైన కొత్త Account head లేదా మార్పులు అవసరమైనచో Divisional Office వారికి తెలియజేస్తూ సంభందిత System Administrator వారిని సంప్రదించవలెను.

 5. ఇంటర్నెట్ సదుపాయము డిపార్టుమెంటుకు సంబంధించిన పనులకు మాత్రమే ఉపయోగించవలెను. Computer నందు ఇతర అనధికార /అనుమతి లేని వెబ్ సైట్లు browse చేయుట, అనధికార సాఫ్ట్ వేర్లు, గేమ్స్, ఫోటోలు, పాటలు, సినిమాలు install/store చేయుట పూర్తిగా నిషేధించబడినది.

6. ఏ కారణం చేతనైన కూడా DATABASE TABLES నందు మార్పులు చేయరాదు. Modules నందు ఏదైనా సమస్య వచినట్లయితే Divisional Office వారికి తెలియజేస్తూ సంభందిత System Administrator వారిని సంప్రదించవలెను.

7. డిపార్టుమెంటు సాఫ్ట్ వేరులకు( MEGHDOOT/Sanchay Post/eMO/R-Net/Speednet/e-Payment) సంభందించిన అన్ని సమస్యలను Divisional Office వారికి తెలియజేస్తూ సంభందిత System Administrator వారిని సంప్రదించవలెను.

8. System Administrator హాజరు అయిన అన్ని సమస్యల వివరాలను నమోదు చేస్తూ ఒక రిజిస్టర్ (Register) మెయింటైన్ చేయవలెను.

                                  పైన సూచించబడిన ఆదేశాలు తప్పనిసరిగా మరియు ఖచ్చితంగా పాటించవలెను. పాటించని యెడల కఠిన క్రమశిక్షణా చర్యలు తీసుకొనబడును.

               


                                                                                                          Sd/-
(మహమ్మద్ జాఫర్ సాదిక్ )
                                                                                   సూపరింటెండెంట్ అఫ్ పోస్ట్ ఆఫీసెస్
                                                                                         నరసరావుపేట డివిజన్ ,
                                                                                        నరసరావుపేట-522601.


No comments:

Post a Comment